ఉప ఎన్నికలకు ముందే టిడిపికి ఓటమి భయం

చాగలమర్రి: నంద్యాల ఉప ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీకి ఓటమి బయం పుట్టుకోస్తుందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం చాగలమర్రి లోని మండల వైయస్సార్పీపి నాయకుడు బాబులాల్‌ నివాసంలో ఏర్పాటు చేసిన రంజాన్‌ వేడుకలకు గంగుల కుటుంబ సమేతంగా హజరై ముస్లిం లకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభద్రాతా భావంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దిగజారుడు గా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉన్నత పదువుల్లో ఉన్న వ్యక్తి పోగడ్తలతో పాటు విమర్శలను సమానాంగా తీసుకోవాలన్నారు. నీరు చెట్టు కార్యక్రమం కేవలం తెలుగు తమ్ముళ్లు దోచుకోవడానికే పరిమిత మైందన్నారు. ప్రజల సోమ్ముతో చేసిన రోడ్లు పై వారినే తిరగవద్దని చెప్పడం ఆయనకు మతిస్ధిమితం లేదని పిస్తుందన్నారు. గతంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన అభివృద్ది పై ఆయన తిరగడం లేదా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలని మంత్రి విసిరిన సవాల్‌ను తమ అభ్యర్థి స్వీకరించారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మా అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలుస్తారని మంత్రి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిధ్దంగా ఉండాలన్నారు. సమావేశంలో నాయకులు గంగుల బిజేంద్రారెడ్డి, సింగం భరత్‌కుమార్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, నారపురెడ్డి, అబ్దుల్లాబాష, భారత్‌గ్యాస్‌ రఫి, పెయింటర్‌ రఫి, జులేబి బాష, వార్డు సభ్యులు నూర్‌బాష, షబ్బీర్, నాయబ్, టోపి బాష, న్యాయవాది సమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top