నంద్యాలలో టీడీపీకి ఓటమి ఖాయం

సైదాపురం : నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడం ఖాయమని వైయస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రం సైదాపురంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీలపై ఈ ప్రభుత్వం ఎంత ప్రేమ చూపుతుందో మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. టీడీపీ ప్రభుత్వం రోజురోజుకూ దుర్మార్గపు పాలన కొనసాగిస్తోందని, త్వరలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిత్యం అమలుకు నోచుకోని వాగ్దానాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదిశేషయ్యనాయుడు, పద్మయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

Back to Top