నంద్యాలలో టీడీపీ ఓటమి తథ్యం

  • ఓటమి భయంతో టీడీపీ దౌర్జన్యాలు
  • ప్రజలు, వైయస్సార్సీపీ నేతలపై వేధింపులు
  • అధికార టీడీపీ అరాచకాలపై వైయస్సార్సీపీ ఆగ్రహం
  • ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ బాబు భయంతో వణుకుతున్నారు
  • చంద్రబాబు కుట్రలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
  • బాబు చేసిన అవమానాన్నిముస్లిం సోదరులు మర్చిపోలేదు
  • బాబుకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
నంద్యాలః ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు భయంతో వణుకిపోతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ఎద్దేవా చేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఓటమి తథ్యమన్నారు. ఓటమి భయంతో ప్రజలు, వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ దౌర్జన్యాలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చంద్రబాబు నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.  చంద్రబాబు కుట్రలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటమి భయంతో గ్రామాల్లో వైయస్సార్సీపీ ముఖ్య నాయకులపై బైండోవర్ కేసులు పెట్టి , పోలీసు స్టేషన్ ల చుట్టూ తిప్పుతూ ఊరు వదిలిపోవాలని బెదిరిస్తున్నారన్నారు.  బెదరకుండా జగన్, శిల్పాను గెలిపించాలని కంకణం కట్టుకున్న వాళ్లపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటూ టీడీపీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.  

గుంతనాలలో రోడ్డుమీదకు వచ్చి వైయస్సార్సీపీ ర్యాలీని దిగ్విజయం చేసిన గ్రామస్తులపై టీడీపీ కక్షగట్టిందన్నారు. ర్యాలీకి నాయకత్వం వహించిన బాలస్వామి అనే నాయకుడి ఇంటిపై దాడి చేయించి, అతడిని హింసించి ఇంట్లో డబ్బులు తీసుకెళ్లార్నారు. దళితుల ఇంట్లో డబ్బులుండకూడదా బాబూ..? లెక్కలు చెప్పినా కూడ ఎందుకు హింసిస్తున్నారని పార్థసారధి ఫైర్ అయ్యారు.ముస్లింలు మీటింగ్ పెట్టి వైయస్సార్సీపీకే మా మద్దతని ప్రకటించినందుకు హుస్సేన్ అనే సోదరుడి ఇంటిమీద రైడ్ చేసి లక్షా 50వేలు సీజ్ చేశారన్నారు. 24న గోల్డ్ లోన్ తీసుకున్నాని బ్యాంకునుంచి స్పష్టంగా లెక్కలు చూపించినా హింసించి ఇబ్బందులు పెట్టారన్నారు. వైయస్ జగన్ మాట్లాడుతున్నప్పుడు ఓ అవ్వ నీకే ఓటేస్తామన్న మాటల్ని విన్న టీడీపీ నాయకుడు ..వారింటికి వెళ్లి నీ పెన్షన్ , ఇళ్లు కట్ చేస్తామని ఆ అవ్వను బెదిరించే స్థితికి దిగజారారన్నారు. వైయస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల దగ్గర వీధి దీపాలు కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ కుట్ర రాజకీయాలను నంద్యాల ప్రజలు గమనించాలని పార్థసారధి విజ్ఞప్తి చేశారు. 

చంద్రబాబు ప్రకటనలను నమ్మే పరిస్థితులో మైనారిటీలు లేరని, ఉపఎన్నికలో బాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. చంద్రబాబు మైనారిటీలకు చేసిన అవమానాన్ని ముస్లిం సోదరులు మర్చిపోలేదన్నారు. మూడున్నరేళ్లుగా తన క్యాబినెట్ లో మైనారిటీ సోదరులకు అవకాశం కల్పించని చంద్రబాబు...నంద్యాల ఎన్నిక రాగానే ఎమ్మెల్సీ, చైర్మన్ పదవులు  అంటూ  చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గంలో మైనారిటీలకు అవకాశం కల్పించని చంద్రబాబుకు ఉపఎన్నికలో ముస్లిం సోదరులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు, వందల కోట్లు ముడుపులు చెల్లించిన వారికే బాబు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి మంత్రి పదవులు ఇస్తున్నారని పార్థసారధి ఫైర్ అయ్యారు.  తన అవసరం కోసం ఎవరినైనా తొక్కేసేందుకు వెనుకాడని చంద్రబాబు నైజాన్ని నంద్యాల ప్రజలు గుర్తించారన్నారు. 


.
Back to Top