టీడీపీ, సీపీఎం నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

విజయనగరం: గరుగుబిల్లి మండలంలోని టీడీపీ, సీపీఎం నాయకులు శుక్రవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి సమక్షంలో కొత్తపల్లి, రావుపల్లి గ్రామానికి చెందిన గుమ్మలక్ష్మిపురం మండలంలోని చాపరాయిబిన్నిడి పంచాయతీలోని మూలబిన్నిడి గ్రామానికి చెందిన సీపీఎం పార్టీకి చెందిన 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలో చేరాయి. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం జిల్లా సమన్వయకర్త బెల్లాన చంద్రశేఖర్, రాజకీయ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసులు రావు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మండల కన్వీనర్లు ఉరిటి రామారావు, దీనమయ్య గిరిబాబు, శేఖర్‌ పాల్గొన్నారు.

Back to Top