వైయస్సార్సీపీలోకి టీడీపీ కౌన్సిలర్లు

గిద్దలూరు : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఐ.వీ.రెడ్డి ఆధ్వర్యంలో లోటస్ పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సమక్షంలో  తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలో చేరారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకుని పార్టీలో చేరినట్లు గిద్దలూరుకు చెందిన కౌన్సిలర్లు తెలిపారు. కౌన్సిలర్లు బిల్ జయలక్ష్మి, షేక్ జమ్రుతి, ఇప్పాల వెంకటేశ్వరులు, గవురమ్మ, మాజీ కౌన్సిలర్లు బిల్ల రమేష్ యాదవ్,వెంకట్ రావు, అల్తాఫ్ తో  పాటు టిడిపి కార్యకర్తలు కూడా వైయస్‌ఆర్‌ సీపీ కండువా కప్పుకున్నారు.

వీరితో పాటు పలువురు ఐటి ఉద్యోగులు  వైయస్ జగన్‌ను కలిసారు. ఈ సందర్భంగా ఐవీ రెడ్డి మాట్లాడుతూ...రాబోయే రోజుల్లో టిడిపిలో ఒక్క కార్యకర్త కూడా మిగిలి ఉండే అవకాశం లేదని, అందరు మంచి భవిష్యత్ కోసం వైయస్ఆర్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు.

Back to Top