రాజధాని ప్రాంతంలో అవినీతి ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చట్ట వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం మాటవినని అధికారులను సైతం బదిలీ చేయిస్తామని, అవినీతి నిరోధక శాఖకు పట్టిస్తామంటూ బెదిరిస్తూ.. పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. తాజాగా భూముల సర్వేను లైసైన్స్‌డ్ సర్వేయర్లకు అప్పగించాలన్న నిర్ణయంతో అవినీతి విచ్చలవిడిగా మారే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత పేదలకు చెందిన లంక అసైన్డ్‌భూములను కొట్టేసేందుకే ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలో భాగమే ఈ నిర్ణయం అని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఇక సర్వేలను తమ ఇష్టానుసారంగా నిర్వహించి భూములు కాజేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.