అవినీతి హత్యా రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టీడీపీ

విజయనగరం మున్సిపాలిటీ: అవినీతి, హత్యా రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అధికార తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు.వేణు, మండల అధ్యక్షుడు నడిపేన.శ్రీనివాసరావు, సీనియర్‌ కౌన్సిలర్‌ ఎస్‌వివి రాజేష్‌లు అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ను మానసికంగా చంపింది, నంద్యాలలో భూమానాగిరెడ్డి మరణానికి కూడా చంద్రబాబే కారణమన్నారు. పత్రికా విలేకరులను, ఐఏఎస్‌ అధికారులను చంపించిన ఘనత వారికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, శాంతి భద్రతలు కుప్పకూలాయన్నారు.రాష్ట్రంలో రాజ్యాంగ పరమైన వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పేరు వినగానే టీడీపీ నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని టీడీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు, జగన్‌మోహనరెడ్డిపై ఎన్ని అవాకులు, చవాకులు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వాస్తవాలు గమనిస్తున్నారన్నారు. గడిచిన మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రానికి, ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్న అధికార టీడీపీ నాయకులు ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఫ్యాక్షన్‌ హత్యలు జరిగింది చంద్రబాబు పాలనలోనేనని, రాజకీయం కోసం ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించిన చరిత్రను స్వంతం చేసుకున్నారన్నారు. చట్టాలు, న్యాయ వ్యవస్థ పట్ల చంద్రబాబుకు ఏమాత్రం గౌరవ లేదన్నారు. తెలుగుదేశ«ం పార్టీ దురాగతాలను తాము ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నేతలు జగన్‌మోహన్‌రెడ్డి దగ్ధం చేస్తే వారికి చట్టాలు వర్తించవా , అదే తరహా నిరసన కార్యక్రమాలు వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తే సెక్షన్‌ల పేరిట అరెస్టులకు పాల్పడటం ప్రజస్వామ్యాన్ని అధికార బలంతో కూని చేయటమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ రైతు విభాగం అధ్యక్షుడు రెడ్డి గురుమూర్తి, పార్టీ అధికార ప్రతినిధి మార్రోజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top