టీడీపీకి పాపం తగులుతుంది

  •  దేవాదయ భూములు అన్యాక్రాంతం
  • ఎకరా రూ.70 కోట్లు విలువ చేసే భూములు రూ.1.40 లక్షలకు లీజుకు
  • సదావర్తి భూములను బాబు తనవారికి అప్పనంగా కట్టబెట్టారు
  • ఏపీ అసెంబ్లీలో భూ ఆక్రమణలపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైయస్‌ జగన్‌ 
ఏపీ అసెంబ్లీ: దేవుడి భూములు కొట్టేసిన పాపం టీడీపీకి తలుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత నిలదీశారు. ఆయన మాట్లాడుతూ..  విజయవాడ దుర్గమ్మ భూములు సిద్దార్థ మెడకల్‌ కాలేజీకి 14 ఎకరాలు లీజుకు ఇచ్చారు. ఎకరా రూ.70 కోట్లు విలువ ఉంటుంది. ఈ ఆస్తి 2006లో అప్పటి ప్రభుత్వం ఈ లీజును రద్దు చేసింది. సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించారు. 2010 ఈ కేసులో ప్రభుత్వం చేసిన చర్యలు సమర్ధించింది. అయితే టీడీపీ ఇప్పుడు ఎకరాకు రూ.1.40 లక్షలకు లీజుకు ఇవ్వడం న్యాయమేనా? చట్టం ఏం చెబుతుందంటే..పది శాతం మార్కెట్‌ విలువకు లీజుకు ఇవ్వాలని ఉంది. ఈ నిబంధనల ప్రకారం లీజుకు ఇస్తే ఎలాంటి ఆక్షేపణలు ఉండవు. అలాంటిది దుర్గమ్మ భూములు కారు చౌకగా లీజుకు ఇవ్వడం సరికాదు. దేవుడి గుడి భూముల విషయంలో లా వ్యవసపాపం. సదావర్తి భూములు కూడా ఇలాగే చేశారు. దాదాపు 400 ఎకరాల భూముల్లో 81 ఎకరాలు మాత్రం అన్యాక్రాంతం కాకుండా ఉంది. సదావర్తి భూముల వద్ద కు పార్టీ బృందం వెళ్లి పెన్సింగ్‌ వేసిన భూమిని పరిశీలించింది. దేవాదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్‌ భ్రమరాంభ  ఇప్పటికి ప్రభుత్వానికి రెండు లేఖలు రాసినట్లు చెప్పారు. అక్కడ రిజిస్ట్రేషన్‌ రూ.7 కోట్లు ఉంటే, మీరు ఎకరా రూ.22 లక్షలకు దారుణంగా ఇచ్చేయడం అన్యాయమన్నారు. ఈ లేఖమీద చివరకు కోర్టుకు వెళ్లామని వైయస్‌ జగన్‌ చెప్పారు. కోర్టులో ప్రభుత్వం విచిత్రంగా వాదనలు వినిపించిందన్నారు. రూ. 22 లక్షల కన్న ఎవరైనా ఎక్కువ ఇచ్చేందుకు ముందుకు వస్తే వీళ్లు రిజిస్ట్రేషన్‌ చేయకుండా కొత్త టర్మ్‌గా సేల్స్‌ సర్టిఫికెట్‌ ఇస్తారట అని తెలిపారు. ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే అదిగో చార్మినర్‌ తెలంగాణ ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి, మేం సెల్స్‌ సర్టిఫికెట్‌ ఇస్తామన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా జరుగుతుందా అని వైయస్‌ జగన్‌ నిలదీశారు.   
––––––––––––––––––––
స్పీకర్‌కు తెలియకుండానే మైక్‌ కట్‌ అవుతుందా?
అసెంబ్లీలో స్పీకర్‌కు  తెలియకుండా మైక్‌ ఎలా కట్‌ చేస్తారని వైయస్ జగన్ ప్రశ్నించారు. మైక్ నిర్వాహణ  ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది. వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటే మైక్‌ కూడా కట్‌ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం..? మీ అనుమతి లేకుండా మైక్‌ ఎందుకు కట్‌ చేస్తారని వైయస్‌ జగన్‌ స్పీకర్ ను  ప్రశ్నించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని ఆరోపించారు.
 
Back to Top