టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా విజయం వైయస్సార్‌సీపీదే

వైయస్సార్‌సీపీ , ఐటీ, యూఎస్‌ఏ కన్వినర్‌లు చల్లా మధు, రత్నాకర్‌
చెన్నూరు : నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు టీడీపీ ఎన్నోకుట్రలు పన్నుతోందని అయినా వైయస్సార్‌సీపీనే విజయం సాధిస్తుందని ఆపార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కన్వినర్‌ చల్లా మధుసూధన్‌రెడ్డి, యూఎస్‌ఏ కన్వినర్‌ రత్నాకర్‌లు అన్నారు . శనివారం వారు కడప నుంచి నంద్యాలకు వెలుతూ ఆలంఖాన్‌పల్లె వైయస్సార్‌ సర్కిల్‌ వద్ద వైయస్సార్‌ విగ్రహానికి పూల మాల వేసి గణంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పాలనను గాలికొదిలేసి మంత్రులంతా నంద్యాలలో తిష్టవేసి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు. వైయస్సార్‌సీపీ మద్దతు దారులను అధికార మదంతో బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులతో ఓటర్లు భయబ్రాంతులకు గురౌతున్నారు. డబ్బు ఎరచూపి ప్రలోభ పెడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా అవి ఫలించవని వైయస్సార్‌సీపీనే అఖండ మెజార్టీతో గెలుపొందుతుందన్నారు. వారి వెంట ఓబులంపల్లె ఉప సర్పంచు వెంకటసుబ్బారెడ్డి, వైయస్సార్‌సీపీ నాయకులు చల్లా అన్వేష్‌రెడ్డి, పోతుల శివ, శివప్రసాద్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Back to Top