సోషల్ మీడియాకు సంకెళ్లు

కృష్ణా: సోష‌ల్‌ మీడియాకు చంద్ర‌బాబు స‌ర్కార్ సంకెళ్లు వేస్తోంది. స్వేచ్ఛను హరించివేస్తోంది.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్‌ల‌ను అక్ర‌మంగా అరెస్టులు చేస్తూ బెదిరింపుల‌కు గురిచేస్తుంది. గుడివాడ‌లో వైయ‌స్ఆర్ సీపీ అభిమాని తోట రాజేష్‌ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌నే ఆరోప‌ణ‌తో పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి అరెస్టు చేశారు. పోలీసుల పేరుతో మంగ‌ళ‌వారం రాత్రి ఐదుగురు వ్య‌క్తులు ఇంటికి వెళ్లి గుడివాడ రెండో టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు రావాల‌ని బెదిరించారు. గుడివాడ నుంచి రాజేష్‌ను వైయ‌స్ఆర్ జిల్లా బ‌ద్వేల్‌కు తీసుకెళ్లారు. రాత్రి నుంచి స‌మాచారం లేక‌పోవ‌డంతో రాజేష్ కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

తాజా ఫోటోలు

Back to Top