ఓటమి భయంతో నంద్యాలలో టీడీపీ కుట్ర

అప్పనపల్లి (మామిడికుదురు) :  వైయస్ ఆర్ సిపి అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టి బాబు అన్నారు. ప్రజలందరూ వీటి గురించే చర్చించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాలలో టిడిపికి ఎదురుగాలి వీస్తోందని, ఓటమి భయంతోనే పార్టీ అభ్యర్ధి శిల్పా మోహన రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి అధ్యక్షుడు ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా శిల్పామోహనరెడ్డి గెలుపును అడ్డుకోలేరన్నారు. . మాజీ సర్పంచ్‌ పిచ్చుక చిన్న, పార్టీ నాయకులు గెడ్డం కృష్ణమూర్తి, భూపతి వెంకటపతి, గెడ్డం వెంకటేశ్వరరావు, గూటం శ్రీను, కారుపల్లి శ్రీను, యూవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top