అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతపై టీడీపీ కుట్ర

తిరుపతి: ఏపీ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షనేత వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పథకం ప్రకారం వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే అసెంబ్లీలో ప్రతిపక్షనేత ఛాంబర్‌లో వర్షపు నీటి లీకేజీ వ్యవహారం నడిచిందని అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని వెనుక ప్రతిపక్షనేత ఉన్నారని అధికార పార్టీ నేతలు బురదజల్లడం అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు సర్కార్‌ ఏర్పడిన నాటి నుంచి వైయస్‌ జగన్‌పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. అసెంబ్లీల్లో ప్రతిపక్ష నేత భవనం లీకేజీపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధపడాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top