వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు

వైయ‌స్ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో భారీ  చేరికలు
29న అనకాపల్లిలో భారీ బహిరంగ సభ
విశాఖ‌:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితులై నిత్యం వివిధ పార్టీల నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. తాజాగా విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ సమక్షంలో సబ్బవరం మాజీ ఎంపీపీ ముత్యాల నాయుడు,ఆర్‌ఏసీస్‌ మాజీ డైరెక్టర్‌ నారాయణ మూర్తి,  పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీనేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. జగన్‌ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో సంక్షేమ పథకాలు అందడంలేదని మళ్లీ రాజన్న రాజ్యం రావాలనే లక్ష్యంతో వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.  వైయ‌స్ జగన్‌ మెహన్‌ రెడ్డి  పాదయాత్రకు వస్తున్న ప్రజల స్పందన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. తప్పకుండా వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతోందన్నారు.  29న అనకాపల్లిలో  భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
Back to Top