'సమైక్యం'తో బాబుకు చెమటలు: ఉమ్మారెడ్డి

గుంటూరు, ఆగస్టు 11 2013 :

ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న సమైక్య ఉద్యమ తరంగాన్ని చూసి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమంటూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఏనా‌డూ చెప్పలేదని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే నష్టమని, సమైక్యంగా ఉంచాలని ఆయన గతంలో కేంద్రాన్ని కో‌రిన విషయాన్ని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ పాలనతో రాష్ట్రం అస్తవ్యస్త‌ం అయిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై గతంలో కేంద్రం నియమించిన జస్టి‌స్ శ్రీకృష్ణ కమిష‌న్కే దిక్కులేదు, ఇక ఆంటోని కమిటీ ఏం చేస్తుందని ‌ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.

తాజా ఫోటోలు

Back to Top