నీటి సంఘాల ఎన్నిక‌ల్లో ప‌చ్చ మార్కు అక్ర‌మాలు..!

రైతుల ఆగ్ర‌హాన్ని గుర్తెరిగి దొంగ దెబ్బ తీస్తున్న ప్ర‌భుత్వం
ఏక‌గ్రీవం అంటూ మెలికేసిన ప్ర‌భుత్వం
అధికారుల్ని ఆడిస్తున్న తెలుగు త‌మ్ముళ్లు
నీటి సంఘాల్ని గుప్పిట్లోకి తీసుకొంటున్న పచ్చ‌దండు

హైద‌రాబాద్‌: నీటి సంఘాల పాల‌క‌మండ‌ళ్ల‌ను తెలుగు త‌మ్ముళ్ల‌తో నింపేసేందుకు ప్ర‌భుత్వం అక్ర‌మాల‌కు తెర లేపింది. ఏక‌గ్రీవంగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నామంటూ ప‌చ్చ చొక్కాల‌తో పాల‌క మండ‌ళ్ల‌ను నింపేస్తోంది.

నీటి సంఘాల ప్రాధాన్యం
వ్య‌వ‌సాయం లో సాగునీటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ నీటి ఆధారంగానే పంట‌లు, వాటిపైన రైతులు ఆధార‌ప‌డి ఉంటారు. అందుచేత ఈ నీటి విడుద‌ల‌లో ప్రజాస్వామ్య‌యుతంగా సంబంధిత రైతుల‌కు ప్రాధాన్యం క‌ల్పించాల‌న్న‌ది సాగునీటి సంఘాల అస‌లు ల‌క్ష్యం. ఆయా నీటి తీరువా ఆధారంగా సంఘాల‌కు గ‌తంలో ఎన్నిక‌లు నిర్వ‌హించేవారు. పార్టీ ర‌హిత ఎన్నిక‌లు అయిన‌ప్ప‌టికీ పాల‌క‌మండ‌ళ్ల‌కు పార్టీల మ‌ద్ద‌తుతో రైతులు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేవారు. స్థానిక రైతుల్లో ప‌ట్టు ఉన్న‌వారే పాల‌క మండ‌ళ్ల‌కు ఎన్నిక‌వ‌టం, ఆయా రైతుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా సాగునీటి సంఘాలు వ్య‌వహ‌రించంటం వంటివి జ‌రిగేవి.

చంద్ర‌బాబు మార్కు రాజ‌కీయం
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పేరు చెబితే చాలు రైతులు ర‌గిలిపోతున్నారు. రుణ మాఫీ చేస్తాన‌ని చెప్పి నిండా అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అటు అప్పులు తీర‌క‌, ఇటు కొత్త రుణాలు దొర‌క్క వ్య‌వ‌సాయ దారులు అల్లాడిపోతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు జ‌రిగితే ఓట‌మి త‌ప్ప‌ద‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ్ర‌హించింది. దీంతో ఏక‌గ్రీవ ఎన్నిక‌లు పేరుతో కొత్త ఎత్త‌గడ‌కు తెర దీసింది. ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా  ఇప్ప‌టికే రెవిన్యూ యంత్రాంగాన్ని చెప్పు చేత‌ల్లోకి తీసుకొంది. దీంతో చాలా చోట్ల రెవిన్యూ అధికారులు తెలుగుదేశం నాయ‌కుల సూచ‌న‌ల మేర‌కు ఎన్నిక‌ల తంతును ముగించేస్తున్నారు.

ప్ర‌తిప‌క్షాల ఆక్రోశం ప‌ట్ట‌దా..!
ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న తీరు మీద ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీ స‌హా ఇత‌ర పార్టీలు, ప్ర‌జా సంఘాలు ముఖ్యంగా రైతు సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వంలో ఏమాత్రం చ‌ల‌నం లేదు. వంద‌ల సంఖ్య‌లో సాగునీటి సంఘాల ఎన్నిక‌లు అక్ర‌మ మార్గంలో జ‌రిగిపోతున్నాయి. ఓట‌ర్ల జాబితాను మార్చేయ‌టం, అధికారుల ఇష్టారాజ్యం గా వ్య‌వ‌హ‌రించటం, జ‌ర‌గుతున్నాయి. అయినా స‌రే అధికార గ‌ర్వంతో ప్ర‌భుత్వం రైతుల నోళ్లు నొక్కేస్తోంది.
Back to Top