రైతులను మోసగించిన టీడీపీ ప్రభుత్వం

పెనమలూరుః టీడీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని నేటికి, జిల్లాలో సాగు నీరు ఎప్పుడు విడుదల చేస్తారనేది నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఆరోపించారు. వారు కానూరులో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు నీరు ఇచ్చే విషయంలో మంత్రి దేవినేని ఉమ కనిపించకుండా పోయాడని,అతను రైతులను ధగా చేస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి ప్లీనరీలో చేసిన ఆరోపణల పై సరైన సమాధానం ఇవ్వకుండా టీడీపీ నేతలు ఖండించటం విడ్డూరంగా ఉందన్నారు. పట్టి సీమ నీరు జిల్లాకు వస్తే జిల్లాలో గత ఖరీప్‌లో పంటలు ఎందుకు ఎండిపోయాయని ప్రశ్నించారు.. రైతుల రుణాలు మాఫీ ఏమైందని , ఇప్పటికైనా రైతుల రుణాల మాఫీ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.మంత్రితో పాటు తెలుగుతముళ్లకు కూడా మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఖండించారు.ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కొఠారిశ్రీనివాసరావు, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లే నరసింహారావు,మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు గద్దలరాజా,బీసీ విభాగం అధ్యక్షుడు మరీదుశ్రీను తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top