టీడీపీ ఓటుకు నోటు రాజకీయాలు

విశాఖపట్నంః పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ ఓటర్లను ప్రలోభపెడుతూ అక్రమాలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో కొయ్య ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. నారాయణ, చైతన్య కాలేజ్ లలో ఓటు  నమోదు చేస్తే ప్రాక్టికల్స్ లో మంచి మార్కులు వేస్తాము అంటూ మంత్రి నారాయణ విద్యార్థులను మభ్య పెడుతున్నారని , గీతం విద్యాసంస్థలలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

ఓటు నమోదుకు రూ.10 వేలు చొప్పున, ఎన్నికలలో ఓటు వేసిన తరువాత రూ.20 వేలు చొప్పున వెదజల్లేందుకు ఆశచూపుతున్నారని ప్రసాద్ రెడ్డి విమర్శించారు.  అధికార దాహం కోసం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మీద ఎన్నికల అధికారి, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయకుండ ఈ రోజు ,రేపు అంటూ కాలయాపన చేస్తూ బాబు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అని ప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. 
Back to Top