టీడీపీ క‌క్ష‌సాధింపు

క‌ర్నూలు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ చూసి ఓర్వ‌లేక అధికార తెలుగు దేశం పార్టీ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లకు పాల్ప‌డుతోంది. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న వారందరికీ రుణాలు రద్దయ్యాయి. వైయ‌స్‌ జగన్‌ను కలిసినందుకే తనకు మంజూరైన రుణాన్ని రద్దు చేశారని వెనుకబడిన కులానికి చెందిన లబ్ధిదారుడు అరవప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రజాసంకల్పయాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. సాయంత్రానికి తనకు మంజూరైన రుణం రద్దు చేశారని తెలిపారు. తనకు మంజూరైన రుణాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఈ చ‌ర్య‌ల‌పై బీసీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటే సంక్షేమ ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తారా అనిప్ర‌శ్నిస్తున్నారు.
Back to Top