బీజేపీ. టీడీపీ లు బంగాళాఖాతానికే..!

ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాల‌న్న చంద్ర‌బాబు... తిరిగి ప్ర‌త్యేక
హోదా సంజీవ‌ని కాదు అన్నేంత వ‌ర‌కు వ‌చ్చార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి అన్నారు. లోక్ సభలో ప్రత్యేక హోదా మీద పార్టీ
అభిప్రాయాల్ని ఆయన వెల్లడించారు. బాబు మాట‌ల‌ను చూస్తుంటే ప్ర‌ధాని మోడీ త‌న రాజ‌కీయ
మాట‌ల‌తో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ను అని చెప్పారేమోన‌ని అందువ‌ల్లే చంద్ర‌బాబు ప్ర‌త్యేక
హోదాపై నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మేకపాటి
ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

 

*
 ప్ర‌త్యేక హోదా
రాదని అరుణ్‌జైట్లీ చెప్పిన అనంత‌రం చంద్ర‌బాబు ప్ర‌జాగ్ర‌హాన్ని చూశారు

*
కేంద్రం ప్ర‌త్యేక
హోదా ఇవ్వ‌కుండా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటుంద‌ని చంద్ర‌బాబు మాట మార్చారు

*
బీజేపీ, టీడీపీని ప్ర‌జ‌లు బంగాళా ఖాతంలో క‌లిపే ప‌రిస్థితి
ముందుంద‌న్నారు. 

*
కేంద్ర‌ప్ర‌భుత్వం, చంద్ర‌బాబు మాట‌లు చిత్త‌శుద్ధి లేకుండా
ఉన్నాయి

*
 ఆనాడు మ‌న్మోహ‌న్ సింగ్ ఐదేళ్ల ప్ర‌త్యేక హోదా
అంటే... బీజేపీ ప‌దేళ్లు ఇవ్వాల‌ని... టీడీపీ ప‌దిహేనేళ్లు ఇవ్వాలంటూ ప్ర‌జ‌ల‌ను
మాట‌ల‌తో మోసం చేశాయి.

*
చంద్ర‌బాబు
ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల ప్ర‌కారం ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు అన్ని హామీల‌ను
నెర‌వేర్చాలి

*
ఇందుకోసం బీజేపీతో
కొన‌సాగుతారో...  లేక విడాకులు తీసుకుంటారో
సంబంధం లేదు.

*
ప్ర‌త్యేక హోదా
కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ఏపీ బంద్‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు
స‌హక‌రించాలి

*
పార్ల‌మెంట్‌లో
వైయ‌స్సార్ సీపీ స‌భ్యులంద‌రం కలిసిగ‌ట్టుగా కృషి చేస్తున్నాం... 

 

Back to Top