టీడీపీ, బీజేపీలవి లాలూచీ రాజకీయాలు

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు లాలూచీ రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు వీఆర్‌ కళాశాల ప్రాంగణంలో వైయస్‌ఆర్‌ సీపీ చేపట్టిన వంచనపై గర్జన దీక్షకు అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇష్టారీతిగా అన్యాయాలు, అక్రమాలకు పాల్పడి.. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు బయటకు వచ్చారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసాన్ని కప్పిచ్చుకునేందుకు మరో నాటకానికి తెరతీశారన్నారు. బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ కలిసిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాల పురిటిపై పుట్టిన పార్టీ అని, ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబును మోసం చేయలేదని, ఇద్దరూ కలిసి ఆంధ్రరాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు లక్షల కోట్లు దోచుకున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు
Back to Top