టీడీపీ పాల‌న‌లో పేద‌ల‌కు అన్యాయం


వెంక‌టాచ‌లం (నెల్లూరు): చ‌ంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌లో బ‌డాబాబుల‌కు త‌ప్పితే పేద‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. పేద‌ల పొట్ట‌కొట్టి పెద్ద‌ల‌కు దోచిపెట్ట‌డం వంటి దుర్మార్గ ప‌నులు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. స్థానిక త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో గ్రీవెన్స్‌డే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కాకాణి మీడియాతో మాట్లాడారు. అధికారులు టీడీపీ నాయ‌కులకు తొత్తులుగా మారిపోయార‌న్నారు.  గ్రీవెన్స్‌ డే లో ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. ఇళ్లస్థలాలు, ఫించన్లు, రేషన్‌కార్డులు కోసం నెలల తరబడి ప్రభుత్వం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుంటుందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందజేసేందుకు గ్రామసభల ద్వారా చేయల్సి ఉంటే, జన్మభూమి కమిటీల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అధికారులు టిడిపి నాయకులకు తొత్తులుగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పొసుపు కుంభకోణంలో వీర్వోలు బలైనట్లు పంచాయతి కార్యదర్శలు బలికావద్దని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లబ్దిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా చేయాలని గ్రామ కార్యదర్శులకు సూచించారు. జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకు అధికారులు పనిచేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
Back to Top