వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు

మడకశిర రూరల్‌: మండల పరిధిలోని ఎగువ అచ్చంపల్లి గ్రామంలో  వైయస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి సమక్షంలో టీడీపీ నుండి 45 కుటుంబాలు, కాంగ్రెస్‌ నుంచి 15 కుటుంబాల ప్రజలు వైయస్సార్‌సీపీలోకి చేరారు.  వీరికి సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగేగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాములు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి మాట్లాడుతూ ....తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని తెలిపారు. కరువు సమస్యలు అధికంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు బీమా, పంట నష్టపరిహారం ఇంత వరకు అందలేదన్నారు. పశుగ్రాసం కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హంద్రీనీవా కాలువ పనులు పూర్తి కాలేదన్నారు. ఇంకా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

 సమస్యలపై ఈనెల 8న జరిగే వైయస్సార్‌సీపీ ప్లీనరీలో పూర్తి స్థాయిలో చర్చిస్తామన్నారు. ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామం నుండి ప్లీనరీకి కార్యకర్తలను తరలించాలని కోరారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయక అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతుండటంతో తాము టీడీపీని వీడామని వైయస్సార్సీపీలో చేరిన నాయకులు తెలిపారు. గ్రామస్థాయి నుండి వైయస్సార్‌సీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్సార్‌సీపీ నాయకులు ఆమిదాలగొంది శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, తిమ్మారెడ్డి, నారాయణస్వామి, నాగరాజు, మల్లేష్, రామిరెడ్డి, తిమ్మరాయుడు, మూర్తినాయక్, శీనప్పస్వామి, దివాకర్, హరిప్రసాద్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Back to Top