టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది

వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బొల్లా బాలిరెడ్డి
బేస్తవారిపేట: అధికారంలో ఉన్నామని టీడీపీ అరాచకాలకు పాల్పడుతుందని వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బొల్లా బాలిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టినందుకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. టీడీపీ అధికారం ఉందని ప్రభుత్వ వ్యవస్థనంతా తమ చేతుల్లోకి తీసుకుని పార్టీ సానుభూతిదారులపై దాడులకు తెగబడుతుందని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలపై అక్కసుతోనే టీడీపీ వాళ్లు ఇలాంటి అనుచితమైన పనులు చేస్తున్నారని, గిద్దలూరులో జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. గలిజేరుగుళ్ల సొసైటీ బ్యాంక్‌ అధ్యక్షుడు ఇండేల నాగిరెడ్డి, నాయకులు కొణతం రామకోటిరెడ్డి, జడబోయిన కోటయ్య, సుబ్బారెడ్డి, కే కొండారెడ్డి, భీమయ్య, చలమయ్య పాల్గొన్నారు.

Back to Top