టీడీపీ కార్యకర్తలు వైయస్సార్‌సీపీలో చేరిక

తిరువూరు : పాతతిరువూరుకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు శుక్రవారం వైయస్సార్‌సీపీలో చేరారు. పట్టణ తెలుగుదేశం పార్టీ నేతల విధానాలతో విసిగిపోయామని, అభివృద్ధి పనుల నిర్వహణలో రాజకీయాలకు తోడు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ విఫలమవడంతో తాము వైయస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు నాయని కోటేశ్వరరావు, జాదం నరేష్, రాజు, రాజేష్, ప్రశాంత్‌ల ఆధ్వర్యంలో 50 మంది వైయస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైయస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలు పేదరిక నిర్మూలనకు తోడ్పడతాయని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు శీలం నాగనర్సిరెడ్డి, చలమాల సత్యనారాయణ, పార్టీ యువజన విభాగ నాయకుడు వాళ్ళ సురేష్, జిల్లా కమిటీ సభ్యులు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, ఆలపాటి శ్రీనివాసరావు, నగరపంచాయతీ కౌన్సిలర్లు రామవరపు లక్ష్మణరావు, ఏరువ ప్రకాష్‌రెడ్డి, చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, మైనారిటీ నాయకులు జాకీర్, కాలేషా, గౌస్‌ పాల్గొన్నారు.

Back to Top