చెవిరెడ్డిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ

చిత్తూరు: ప్రభుత్వ అవినీతి, అక్రమాలను, అన్యాయాలను నిలదీస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అధికార టీడీపీ కక్షసాధింపుకు పాల్పడుతోంది. 
చిత్తూరు జిల్లా చంద్రగిరి  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పోలీసులను ఉసిగొల్పి మరోసారి చంద్రబాబు అక్రమ కేసులు బనాయించారు.  గురువారం రాత్రి సబ్కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగినందుకు ఆయనపై అక్రమంగా కేసు పెట్టారు.  

శుక్రవారం పోలీసులు చెవిరెడ్డిని పుత్తూరు కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు చెవిరెడ్డిని చిత్తూరు జైలుకు తరలించారు. చెవిరెడ్డి విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని  ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఆయనపై అక్రమకేసులు బనాయిస్తూ వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గురువారం తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామంలోని రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరును చెవిరెడ్డి తప్పుబట్టారు. ఎనిమిదేళ్లుగా ఆస్తిపన్ను, కరెంటు బిల్లులు కడుతున్నా... పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బాధితుడి పక్షాన వెళ్లి అన్యాయంపై పోరాడినందుకు చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై వైయస్సార్సీపీ మండిపడింది. 

తాజా వీడియోలు

Back to Top