ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..!

రొంపిచెర్ల: ప్రజా సమస్యల పరిష్కారానికి వైయస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు కృషి
చేయాలని పుంగనూరు ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి
అన్నారు.  చిత్తూరు జిల్లా రొంపిచర్లలో పార్టీ
నాయకులు సూర్య నారాయణరెడ్డి ఇంట్లో జరిగిన శుభాకార్యానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా
పార్టీ అగ్రనేతల్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ
సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే   మాట్లాడుతూ గ్రామాలలో ప్రజా సమస్యలను గుర్తించి
వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తాగునీటి సమస్య ఉంటే తమ దృష్టికి
తెస్తే ఎంపీ నిధులను మంజూరు చేయిస్తామని తెలిపారు. ప్రజల మధ్యనే ప్రజా ప్రతి
నిధులు,
కార్యకర్తలు   ఉండాలని
తెలిపారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ పరిశీలకుడు
పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి,  వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శులు చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం
ప్రధాన కార్యదర్శి ఇబ్రహీంఖాన్, మండల వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ చెంచురెడ్డి   తదితరులు పాల్గొన్నారు. 

 

Back to Top