ఆంధ్ర‌కేస‌రికి ఘ‌న నివాళివిశాఖ‌: తెలుగుజాతి యావత్తూ గర్వించే వ్యక్తి.. స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర‌కేస‌రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. విశాఖ జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్  గురువారం ఉదయం దార్లపూడి గ్రామంలోని బ‌స ప్రాంతంలో టంగుటూరి ప్ర‌కాశం పంతులు చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. అనంత‌రం జ‌న‌నేత పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
Back to Top