చంద్రబాబుకు అప్పుడు ఎంత చెప్పినా వినలేదు

హైదరాబాద్:

కృష్ణా జలాల కోసం ఎన్టీఆర్ 11 ప్రాజెక్టులు చేపడితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాటిని మూలన పడేశారని వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆ ప్రాజెక్టులు కట్టకపోతే శాశ్వతంగా నష్టం కలుగుతుందని అప్పట్లో చంద్రబాబుకు ఎంత చెప్పినా వినలేదని ఆయన గుర్తు చేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉండగా, చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, మిగులు జలాలపై హక్కు లేదని సుప్రీంకోర్టు ఆనాడే తీర్పు ఇచ్చిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు.

అలాంటి చంద్రబాబు ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డిని నిందించడం దారణమని తమ్మినేని ‌ఖండించారు. కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు వల్లే అన్యాయం జరిగిందని, దీనిపై టీడీపీ నేతలతో ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధమని తమ్మినేని సీతారాం సవాల్ ‌చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top