"ఛీ".. మీరొక ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేలా

రూ. వేల కోట్ల ఇసుక దోపిడీ...అధికారులపై చింతమనేని గూండాయిజం
పరాకాష్టకు ప్రభుత్వ అవినీతి-చంద్రబాబుకు ముడుపులు
హామీలపై బహింరగ చర్చకు సిద్ధమా..తమ్ముళ్లకు తమ్మినేని సవాల్

శ్రీకాకుళంః
ప్రభుత్వం విచ్చలవిడీగా ఇసుక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేత
తమ్మినేని సీతారాం మండిపడ్డారు. అధికార యంత్రాంగాన్ని భయపెట్టి,
బెదిరించి.... ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ రాత్రికి రాత్రే పచ్చనేతలు
రూ.కోట్లకు పడగలెత్తుతున్నారని ధ్వజమెత్తారు. అధికార వ్యవస్థను నిర్వీర్యం
చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ల తాబేదారులు ఇసుకను లూటీ చేస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ చేసిన తప్పులను
కప్పిపుచ్చుకునేందుకు ఆనెపాన్ని అధికారులపై తోసేస్తున్నారని నిప్పులు
చెరిగారు. 

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
ప్రభాకర్ అనే రౌడీషీటర్ పై 37 కేసులున్నాయని తమ్మినేని తీవ్రస్థాయిలో
విరుచుకుపడ్డారు. గూండా ప్రభాకర్.. వనజాక్షి అనే అధికారిణి బహిరంగంగా
కొడితే ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇంతకన్నా
ఇంకేం రుజువు కావాలని నిలదీశారు. ఇసుక మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత మీకు
లేదా చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీరొక
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలా అంటూ తమ్మినేని పచ్చచొక్కాల
పైశాచికత్వాన్ని తూర్పారబట్టారు. 

చంద్రబాబుకు
ముడుపులు అందుతున్నాయి కాబట్టే అధికారులను కొట్టినా అడగలేని దిక్కుమాలిన
పరిస్థితుల్లో ఉన్నాడని తమ్మినేని ఫైరయ్యారు. రాష్ట్రంలో అవినీతి
పరాకాష్టకు చేరిందన్నారు. వాటా అయామ్ సేయింగ్ అంటూ చంద్రబాబు తమ్ముళ్ల
అవినీతి వసూళ్లలో ముడుపులు పుచ్చుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ
ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని
దుయ్యబట్టారు.  

ప్రజాబ్యాలెట్ లో తాము సంధించిన
ఒక్క ప్రశ్నకైనా ఇప్పటివరకు సమాధానం ఇచ్చే ధైర్యం చేశారా అని తమ్మినేని
తెలుగుతమ్ముళ్లను ఏకిపారేశారు. తెలుగుదేశానికి సంబంధించినా ఏ నాయకుడైనా
దమ్ముంటే ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు రావాలన్నారు. ఓటుకు కోట్లు కేసులో
అడ్డంగా దొరికిపోయిన నీవు ...ఆ గొంతు తనది కాదని లోకేష్ పై ప్రమాణం చేయగలవా
చంద్రబాబు అంటూ తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. 
Back to Top