శ్రీకాకుళంః ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసపుచ్చుతున్నారని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజాబ్యాలెట్ లో సంధించిన వంద ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ముఖ్యమంత్రిగానీ, తెలుగుదేశానికి చెందిన తల ఉన్న ఏ నాయకుడైనా దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని తమ్మినేని సవాల్ విసిరారు. ఏ వాగ్ధానాన్ని అమలు చేయకుండా రైతులు, మహిళలు అన్ని వర్గాల వారిని చంద్రబాబు మభ్యపెడుతున్నారని తమ్మినేని విమర్శించారు. <br/>రుణాలు మాఫీ చేస్తామన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని డాబులు పలికారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలకు దిక్కులేకుండా పోయిందని తమ్మినేని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని షుగర్ ఫ్యాక్టరీలన్నీమూతబడేశారని తమ్మినేని విమర్శించారు. ఆముదాలవలసతో పాటు రాష్ట్రంలోని షుగర్ ఫ్యాక్టరీలను ఏరంగంలో తెరిపిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.