చంద్రబాబుకు తమ్మినేని సవాల్...!

శ్రీకాకుళంః తోటపల్లి ప్రాజెక్ట్ ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. అది తమ గొప్పతనమేనంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. దమ్ముంటే తోటపల్లి ప్రాజెక్ట్  అంశంపై టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి  చర్చకు రావాలని తమ్మినేని సవాల్ విసిరారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పనులను తనవిగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 

శుక్రవారం మీడియాతో మాట్లాడిన తమ్మినేని..తోటపల్లి ప్రాజెక్ట్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ. 450 కోట్లు నిధులు విడుదల చేశారని చెప్పారు. చంద్రబాబు కేవలం రూ. 50 కోట్లు నిధులు మంజూరు చేసి అన్నీ తామే చేశామన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top