సామాన్యుడి నడ్డి విరిచేలా ఛార్జీల పెంపు


రాష్ట్రంలో సామాన్యుడు ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ఎక్కలేని
పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు.ఎన్నికల సమయంలో అయిదేళ్ల పాటు ఏ
ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను
తుంగలోకి తొక్కారని ఆయన  మండిపడ్డారు.

 

తమ్మినేని శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ  క్రూడాయిల్, డీజిల్
ధరలు తగ్గినా చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా సామాన్యుడి నడ్డి విరిచేలా
ఛార్జీలు పెంచారన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ఈ చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా
ఖండిస్తుందన్నారు. ఛార్జీలు పెంచి ప్రయివేట్ ఆపరేటర్లకు మార్గం సుగమం చేశారన్నారు.
మద్యం రేట్లు తగ్గించి, కుళాయిల్లో
మంచినీళ్లకు బదులు నారావారి సారా ఇస్తున్నారని తమ్మినేని విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top