బాబు కంటే తాలిబన్ల పాలనే న‌యం

  • ప్ర‌శ్నిస్తే అరెస్టులు చేస్తారా?
  • క్షమాపణ అనే కొత్త చట్టాన్ని బాబు ఏమైనా కనుగొన్నాడా
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
  • విజయవాడ: ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన కంటే అఫ్ఘనిస్తాన్‌లో తాలీబన్ల పాలన బాగుంటుందేమోనన్న అనుమానం కలుగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఐజీ స్థాయి అధికారి బాలసుబ్రమణ్యంపై దాడి ఘటనపై టీడీపీ సభ్యులను శిక్షించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను అక్రమంగా, అధర్మంగా, నిరంకుశత్వంతో అరెస్టు చేశారని మండిపడ్డారు. న్యాయం కోసం పోరాడుతున్న తనను తీవ్రవాధిని బంధించినట్లుగా బంధించి ఏ ఒక్కరిని కూడా కలవనివ్వకుండా కుట్ర చేశారని ధ్వజమెత్తారు. పోలీసుల కస్టడీ నుంచి విడుదలైన అనంతరం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక నిజాయితీ గల ఐజీ స్థాయి అధికారిపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దుర్భాషలాడితే వారిపై కేసులు పెట్టే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. వాళ్లను ప్రోత్సహిస్తూ మీడియేటర్‌గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి క్షమాపణ అనే నాటకాన్ని ఆడి సమస్య ముగిసిపోయిందనడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో మనుషులు దూరి దాడులు చేసి క్షమాపణ అంటే ఊరుకుంటారా అని చంద్రబాబును ప్రశ్నించారు. 
    ఇదేం ప్రజాస్వామ్యమో అర్థం కావట్లేదు
    క్షమాపణ చెబితే దాడులు చేసిన వారిపై కేసులు పెట్టకూడదనే కొత్త చట్టాన్ని ఏమైనా చంద్రబాబు కనుగొన్నారా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. లేక మీ పార్టీకేమైనా కొత్త చట్టం రూల్స్‌ పెట్టుకున్నారా అని నిలదీశారు. ఒక మహిళా అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే దిక్కులేదు. మంత్రి కుమారుడు ఒక అమ్మాయిని కిడ్నాప్‌ చేస్తే కేసులు లేవు. కారు రేసులో టీడీపీ ఎమ్మెల్యే కొడుకు చిన్నారుల ప్రాణాలు బలిగొంటే వాటిపై చర్యలకు దిక్కులేదని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. ఉన్నత స్థాయి అధికారికి చంద్రబాబు పరిపాలన రక్షణ లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తిరుపతి విమానాశ్రయంలో ఏ తప్పు చేయకపోయినా ఎంపీ మిథున్‌రెడ్డిని, తనను నెల్లూరు జైలులో బంధించారని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా నిరసన తెలిపే వారిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇదేం ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదని, ప్రజలంతా చంద్రబాబును చూసి అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

Back to Top