ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి
సాక్ష్యాత్తు సీఎం కండువాలు కప్పారు
ఏపీ ప్రభుత్వం భారత రాజ్యంగ పరిధిలో పని చేస్తుందా?


విజయవాడ :  పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఫిర్యాదుపై స్పందించి, జెడియు ఎంపిలను అనర్హలుగా ప్రకటించినట్లుగానే రాష్ట్రంలోనూ పార్టీలు ఫిరాయించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు కె.పార్థసారథి డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ  కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  పార్టీ వదిలి వేరే పార్టీకి వెళ్లినా, మరో పార్టీకి మద్దతిచ్చినా వారి సభ్యత్వం చెల్లదు అన్నట్లుగా ఇప్పటికే చాలా తీర్పులు వచ్చాయన్నారు. రాజ్యాంగానికి లోబడి రాజ్యసభ సభ్యులు శరద్‌ యాదవ్, అలీ అన్వర్‌లపై  కేవలం రెండు నెలల్లోనే  చర్యలు తీసుకున్నారన్నారని తెలిపారు.
వైయస్‌ఆర్‌సీపీ టికెట్‌మీదా గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రే బహిరంగంగా ఆ పార్టీ కండువాలు వేసి టీడీపీలో చేర్చుకున్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని పిటీషన్లు ఇచ్చామన్నారు. మార్చి, నవంబర్‌లో కూడా మళ్లీ ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ రాజ్యంగం పరిథిలో పనిచేస్తుందా? చంద్రబాబు కొత్త రాజ్యాంగాన్ని సృష్టించారా? అంబేడ్కర్‌ మీదా గౌరవం మీదా ఉంటే వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాన్ని చూసి ఇకనైనా సిగ్గు తెచ్చుకొని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైయస్ ఆర్ సీపీ  తరపున డిమాండ్‌ చేస్తున్నారు.  రేపటితో చంద్రబాబుకు, స్పీకర్‌కు రాజ్యంగంపై గౌరవం ఉందో? లేదో తేలిపోతుందన్నారు. మీరు నిర్ణయం తీసుకోకపోతే బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌కు నివాళులర్పించే అర్హత కోల్పాతారని హెచ్చరించారు.
Back to Top