తాగునీటి పైప్‌లైన్ ప్రారంభించిన విజయమ్మ

వైయస్ఆర్ జిల్లా:

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ శుక్రవారంనాడు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు.  ఈ సందర్భంగా నియోజకవర్గంలోని లింగాలలో 4 లక్షల రూపాయలతో నిర్మించిన తాగునీటి పైప్‌లైన్‌ను ప్రారంభించారు. అదే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులను కూడా శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top