ఈనెల 22న టీ వైయస్సార్సీపీ ప్లీనరీ

  • హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షులు 
  • పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ
  • కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే భూ కుంభకోణాలు
  • సమగ్ర విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలి
  • టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ః ఈనెల 22న  నగరంలోని నాగోల్ సమీపంలో గల ఓ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరువుతారని చెప్పారు. ప్లీనరీకి తెలంగాణ గ్రామశాఖ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర కమిటీల నేతలు హాజరవుతారని పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ మూడేళ్లలో నీళ్లు, నియామకాలు, నిధుల విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టడంతో పాటు, ప్లీనరీలో పార్టీ బలోపేతంపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు.  రాబోయే కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. 

కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలంగాణలో భూ కుంభకోణాలకు పాల్పడ్డారని గట్టు విమర్శించారు. మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్ గా మారిందని గట్టు శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇక కోటి ఎకరాలకు నీరు, లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఏమైందని గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సందర్భంగా వ్యవసాయం, వైద్య, ఉపాధిపైన చర్చ జరుగుతుందన్నారు. 

Back to Top