టీ వైయస్సార్సీపీ నూతన నియామకాలు

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి నూతన నియామకాలు చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కార్యదర్శులుగాఎ. మోహన్, ఎం.డి. అజ్మీర్, కెరవెల్లి రుక్మారెడ్డి, కె. సుమతీ మోహన్ లు నియమితులయ్యారు. 

జిల్లాల పరిశీలకులుగా..
ఖమ్మం జిల్లా పరిశీలకులుగా బండారు వెంకటరమణ, రంగారెడ్డి జిల్లా పరిశీలకులుగా ఇరుగు సునీల్, మహబూబ్ నగర్ కు డా.ప్రపుల్లారెడ్డి, మెదక్ కు గవాస్కర్ రెడ్డి, నల్గొండ జిల్లాకు యస్. హరినాథ్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు ఆర్. చంద్రశేఖర్, వరంగల్ జిల్లాకు డా.నగేష్,  ఆదిలాబాద్ జిల్లాకు సిగ్గం రాజేష్, నిజామాబాద్ జిల్లాకు కుసుమా కుమార్ రెడ్డి, జీహెచ్ఎంసీ పరిశీలకులుగా పిట్టా రాంరెడ్డి నియమితులయ్యారు. 

రంగారెడ్డి జిల్లా కమిటీలో..
రంగారెడ్డి జిల్లా యువజన విభాగానికి అధ్యక్షునిగా బాయిని చంద్రశేఖర్ ముదిరాజ్, సేవాదళ్ అధ్యక్షులుగా బండారు శ్రీకాంత్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా వేమూరి వెంగల్, రైతు విభాగం అధ్యక్షులుగా పటోళ్ల రాఘవరెడ్డి, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్యమూర్తి నియమితులయ్యారు.  

రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ముదిగొండ రాజయ్య, మాదరగాని జంగయ్య, పొగాకు మల్లేష్, దొంతిరెడ్డి బలవంత్ రెడ్డి, మామిడి సంగమేశ్వర్, భూర్ కాని రామ్మోహన్ నియమితులయ్యారు. కార్యదర్శులుగా మల్లా రాజేందర్, ప్రతాప్ రెడ్డి, కొత్త మానిక్ రెడ్డి, బండారి శ్రీనివాస్ యాదవ్, ఎన్. ప్రభాకర్, గుర్రం మల్లారెడ్డి, అతిరామ్ నాయక్, ఎం.డి. ఖలీల్, సంయుక్త కార్యదర్శులుగా జోసఫ్, శ్రీరాములు నియమితులయ్యారు. 

Back to Top