వైయస్సార్సీపీ నూతన నియామకాలు

హైదరాబాద్ః  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన నియామకాలు చేపట్టింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  పార్టీ కార్యదర్శులు, జిల్లా పరిశీలకులు, ఆయా జిల్లాల అధ్యక్షులు,  రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించడమైనది. 

కార్య‌ద‌ర్శులు, సంయుక్త కార్యదర్శులు..
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శిగా ఎమ్‌.డి. స‌య్య‌దుద్దీన్ ముక్తార్‌, వ‌రంగ‌ల్ జిల్లా కార్య‌ద‌ర్శులుగా సంగాల ఇరిమియా, పూజారి సాంబ‌య్య‌గౌడ్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లా కార్య‌ద‌ర్శులుగా సెగ్గెం రాజేష్, సొల్లు అజ‌య్‌వ‌ర్మ‌, రంగారెడ్డి జిల్లా కార్య‌ద‌ర్శులుగా ర‌మా ఓబుల్‌రెడ్డి, వి.విజ‌య‌ప్ర‌సాద్‌, కొళ్ళ యాద‌య్య‌, బ‌న‌గాని ర‌ఘురామిరెడ్డి,  ఆదిలాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శిగా ఎమ్‌.డి. సాబీర్ హుస్సేన్‌లు నియామ‌కం అయ్యరు. ఇక కరీంనగర్ జిల్లా సంయుక్త కార్యదర్శులుగా వరాల శ్రీనివాస్, యల్లంకి రమేష్, గాలి ప్రశాంత్ బాబు, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శిగా దుబ్బాక గోపాల్ రెడ్డి నియమితులయ్యారు. 

జిల్లా పరిశీలకులు..
ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ జిల్లాల ప‌రిశీల‌కులుగా కె. శివ‌కుమార్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిశీల‌కులుగా న‌ల్లా సూర్య‌ప్ర‌కాశ్‌, ఆదిలాబాద్ జిల్లా ప‌రిశీల‌కులుగా జిన్నారెడ్డి మ‌హేంద‌ర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా ప‌రిశీల‌కులుగా న‌ర్రా బిక్ష‌ప‌తి, మెద‌క్ జిల్లా ప‌రిశీల‌కులుగా కొండా రాఘ‌వ‌రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ప‌రిశీల‌కులుగా హెచ్‌.ఎ. ర‌హ‌మాన్‌, వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిశీల‌కుడిగా వేముల శేఖ‌ర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప‌రిశీల‌కుడిగా రాంభూపాల్ రెడ్డిలు నియ‌మితులయ్యారు. 

జిల్లాల అధ్యక్షులు..
నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడిగా నాయుడు ప్ర‌కాష్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షుడిగా అక్కెన‌ప‌ల్లి కుమార్‌ను పార్టీ నియమించింది. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌రంగ‌ల్ జిల్లా యూత్ అధ్య‌క్షుడిగా భూపాల‌ప‌ల్లికి చెందిన అప్పాము కిష‌న్‌, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌రంగ‌ల్ కిసాన్ అధ్య‌క్షుడిగా పాల‌కుర్తికి చెందిన కె. అచ్చిరెడ్డి, వరంగ‌ల్ జిల్లా విద్యార్థి విభాగం అధ్య‌క్షుడిగా వెస్ట్ వ‌రంగ‌ల్‌కు చెందిన ఎమ్. కౌటిల్‌రెడ్డిని నియమించారు. 

రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు..
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కె. అమృతాసాగ‌ర్‌, రాష్ట్ర వైయ‌స్సార్ సేవాద‌ల్ అధ్య‌క్షుడిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన బండారు వెంక‌ట‌ర‌మ‌ణ‌ నియమితులయ్యారు. 

Back to Top