తెలంగాణ వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్య నాయకుల సమావేశం  హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొంటారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో.. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందిస్తారు. రాష్ర్టంలో పార్టీ పటిష్టత, తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణ, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక తదితర అంశాలపై చర్చిస్తామని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top