మెట్రోరైల్ భవన్ ఎదుట ధర్నా

  • మెట్రో పనుల్లో జాప్యంపై వైయస్సార్సీపీ నిరసన
  • ప్రభుత్వ నిర్లక్ష్యంపై నేతల మండిపాటు
  • పనులను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్
  • అధికారులకు వినతిపత్రం అందజేత
హైదరాబాద్‌:  నగర మెట్రో పనుల్లో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపింది. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ బీజం వేసిన మెట్రో ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నేతలు మండిపడ్డారు. టీ వైయస్‌ఆర్‌ సీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్‌ల ఆధ్వర్యంలో మెట్రో రైలు భవన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌, కేటీఆర్ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. 

రూ. 14 వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు అంచెనాలను  రూ. 17 వేల కోట్లకు పెంచారని  ఫైరయ్యారు. పనులు పూర్తయిన రూట్లలో మెట్రో రైళ్లను ప్రారంభించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, 2019 ఎన్నికల ప్రయోజనాల కోసమే ఈ విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. 
Back to Top