14న కలెక్టరేట్‌ల వద్ద టీవైయస్‌ఆర్‌ సీపీ ధర్నా

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నాయకులకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతులను మోసం చేసేందుకు విడుదల చేసిన జీఓ నంబర్‌ 39ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. రైతుల సమన్వయ సమితిలతో రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. జీఓ 39ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ధర్నాకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top