సైదాపురం ‘వెయ్యి’ మైలురాయి కావడం సంతోషం

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సైదాపురం వెయ్యి కిలోమీటర్ల మైలురాయి కావడం సంతోషంగా ఉందని సైదాపురం సర్పంచ్‌ బండి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల విజయ స్థూపం ఏర్పాటు చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ నుంచి రిటైర్డ్‌ అయిన తరువాత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలకు అందించిన సువర్ణ పాలనను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలకు వచ్చానన్నారు. అదే స్ఫూర్తితో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్‌గా ఘనవిజయం సాధించి అనేక అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. జనం కోసం మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన జననేత 2019లో ముఖ్యమంత్రి అవుతారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలన్నీ గట్టెక్కుతాయన్నారు. 
Back to Top