లక్షల కోట్ల దోపిడీ కోసమే

హైదరాబాద్ః లక్షల కోట్ల దోపిడీ కోసమే చంద్రబాబు ఎలాంటి పారదర్శకత లేని స్విస్ ఛాలెంజ్ విధానం తీసుకొచ్చారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అది స్విస్ ఛాలెంజ్ కాదని సూట్ కేసుల ఛాలెంజ్ అని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని...రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని తమ నాయకుడు వైయస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారని తెలిపారు.  రాజధాని పేరిట  రైతుల భూములను దోచుకొని సింగపూర్  కంపెనీలకు కట్టబెట్టడాన్ని భూమన తీవ్రంగా తప్పుబట్టారు.

Back to Top