స్వామి వివేకానంద.. స్ఫూర్తి ప్రదాత

చిత్తూరు: స్వామి వివేకానంద భారతదేశానికి నిరంతర స్ఫూర్తి ప్రదాత అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.  స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘనంగా నిర్వ‌హించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వివేకానంద చిత్ర‌ప‌టానికి వైయ‌స్ జ‌గ‌న్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా వివేకానందుడి సేవ‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ కొనియాడారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, నాయ‌కులు డాక్ట‌ర్ హ‌రికృష్ణ‌, కాసు మ‌హేష్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top