పట్టిసీమతో ఒరిగేదేమీలేదు..!

కర్నూలుః టీడీపీ ప్రభుత్వం బడాయి కోసమే నధుల అనుసంధానం నాటకం ఆడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అధికారపార్టీ చేపట్టిన పట్టిసీమ కేవలం కృష్ణాడెల్టాకు నీరందించడం కోసమేనని..దానివల్ల రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రాయలసీమలోని నధులను అనుసంధానం చేస్తేనే సీమ సస్యశ్యామలం అవుతుందన్నారు.

నధుల అనుసంధానం గతంలోనే కాటన్ దొర ప్రారంభించారని...అదేదో తామే చేసినట్లు టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం పట్టిసీమ డ్రామాలాడుతున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండకముందే నీటిని వదిలి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని....కర్నూలు జిల్లా పరిషత్ లో జరిగిన నధుల అనుసంధాన సదస్సులో మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top