నిరుద్యోగులకు ఉపాధి కల్పన అభినందనీయం: ఎస్వీ

కర్నూలు: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం అభినందనీయమని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ జాబ్ ఫీస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక డీవీఆర్ హోటల్‌లో రెండు రోజుల పాటు జాబ్‌మేళా నిర్వహించారు. మేళా ముగింపు కార్యక్రమానికి ఎస్వీ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.  రాయలసీమ ప్రాంతంలోని విద్యార్థులు నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి మార్గ నిర్దేశనంగా నిలవాలని సూచించారు. సుమారు 80 మంది బీటెక్ చదివిన విద్యార్థులను ప్రైవేట్ కంపెనీల్లో నియామకాల కోసం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్సార్ జాబ్ ఫీస్ట్ ప్రెసిడెంట్ కె. అన్నపూర్ణారెడ్డి, ఎ.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top