అసెంబ్లీలో లేకపోయినా సస్పెన్షన్..!

బద్వేలు) అదేదో సినిమాలో మనిషి లో ప్రాణం
లేకపోయినా డాక్టర్లు వైద్యం చేసేస్తారు. చంద్రబాబు ప్రభుత్వ పనితీరు అలాగే ఉంది. అసెంబ్లీ
సమావేశాల్లో లేకపోయినప్పటికీ, వైఎస్సార్సీపీ అంటే చాలు సస్పెండ్ చేసేస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు శబరిమలై అయ్యప్పస్వామి
దర్శనం కోసం వెళ్లి, శనివారం నాడు ఇంటికి చేరుకొన్నారు. అంతకు ముందు రోజు
శుక్రవారం రోజు ఆయన శబరిమలైలో ఉన్నారు. కానీ, ఆయన అసెంబ్లీలో శుక్రవారం అనుచితంగా
ప్రవర్తించారంటూ చంద్రబాబు ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. అసెంబ్లీకి హాజరు
కాని వ్యక్తిని కూడా సస్పెండ్ చేసేంత గొప్ప ప్రభుత్వం ఇదన్న మాట. మేం చెప్పిందే
ఫైనల్ అని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామక్రిష్ణుడు పదే పదే చెబుతున్నట్లుగానే
సభలో లేని సభ్యుడి మీద కూడా సస్పెన్షన్ విధించ గలిగారు. 

Back to Top