షిండే వ్యాఖ్యలపై మండిపడిన మైసూరా

గుంటూరు, 22 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజనకు తాము అనుకూలంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లేఖ ఇచ్చి, తర్వాత మాట మార్చిందంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పడంపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి మండిపడ్డారు. పార్టీపై షిండే బురద చల్లుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. షిండే చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యమని అన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించేందుకు గురువారం గుంటూరు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తాము అఖిలపక్ష సమావేశంలో షిండేకు చెప్పామని మైసూరారెడ్డి తెలిపారు. కానీ తాము చెప్పిన విషయాన్ని పక్కన పెట్టి, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడటం దౌర్భాగ్యమని మైసూరారెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ తరఫున తాము చెప్పిన విషయాలన్నింటినీ షిండే పూర్తిగా పక్కనపెట్టి, తన నోటికి వచ్చినది చెప్పేస్తున్నారని విమర్శించారు.

Back to Top