ఆరోగ్యశ్రీ వల్లే తాను బతికాను


 తూర్పుగోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే తాను బతికానని ఇంజరం వాసి కుడిపూడి సూర్యావతి పేర్కొన్నారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను ఆమె కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్‌ఆర్‌ తనకు దేవుడితో సమానమని ఆమె పేర్కొన్నారు. 2014లో తన గుండెకు రంద్రం పడిందని, అప్పట్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించి తనకు పునర్‌జన్మనిచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం నీరుగారిపోయిందని, రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందని సూర్యావతి పేర్కొన్నారు. 
 
Back to Top