మోహన వికాస్‌రెడ్డికి అభినందనలు

తూర్పుగోదావ‌రి: నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌(ఎన్‌టీఎస్‌ఈ)లో ప్రతిభ కనబర్చిన కొవ్వూరి మోహన్‌ వికాస్‌రెడ్డిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యానారాయణరెడ్డి సోమవారం అభినందించారు. మండలంలోని పొలమూరుకు చెందిన మోహన్‌వికాస్‌రెడ్డి ఎన్‌టీఎస్‌ఈలో ఎనిమిదవ ర్యాంకు సాధించిన విషయం పాఠకులకు విదితమే. జాతీయస్థాయి ప్రతిభా పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించడం ద్వారా  స్టేజ్‌1 నుంచి స్టేజ్‌2కు  సాధించడం గొప్ప విషయంగా ఆయన పేర్కొన్నారు.  మోహన్‌వికాస్‌రెడ్డి పదవ తరగతిలో మరింత ప్రతిభ కనబర్చి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. మోహన్‌వికాస్‌రెడ్డిని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి చిర్ల వీర్రాఘవరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఒంటిమి సూర్యప్రకాశం, నాగేశ్వరరావు, మండల కన్వీనర్‌ మల్లిడి ఆదినారాయణరెడ్డి, బిక్కవోలు మండల యూత్‌ కన్వీనర్‌ గువ్వల సత్తిరెడ్డి, అధికార ప్రతినిధి మానుకొండ సాగర్‌ రెడ్డి, పార్టీ నేతలు కోనాల సత్యనారాయణరెడ్డి, ఎరకారెడ్డి, శ్రీధర్‌రెడ్డిలు అభినందించారు.  

Back to Top